నిరుపేద దళిత రైతు కుటుంబం నుంచి న్యాయరంగంలో అత్యున్నత గౌరవం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులైన శ్రీ పల్లె నాగేశ్వరరావుకు హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలోని నిరుపేద దళిత రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి న్యాయరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.
హుజూర్‌నగర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యనభ్యసించిన పల్లె నాగేశ్వరరావు మూడు దశాబ్దాలకు పైగా న్యాయవృత్తిలో కొనసాగుతూ పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, గవర్నమెంట్ ప్లీడర్,టీటీడీ స్టాండింగ్ కౌన్సెల్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్,తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు.
అలాగే తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి న్యాయవాదుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేశారు.నిరుపేద కుటుంబం నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం న్యాయరంగంలో అత్యున్నత గౌరవాన్ని అందుకునే స్థాయికి చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువ న్యాయవాదులకు,వెనుకబడిన వర్గాల యువతకు ఆయన జీవన ప్రస్థానం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా పల్లె నాగేశ్వరరావు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి,న్యాయరంగంలో మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ పలువురు శుభాకాంక్షలు తెలిపరి