నిరుపేద దళిత రైతు కుటుంబం నుంచి న్యాయరంగంలో అత్యున్నత గౌరవం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులైన శ్రీ పల్లె నాగేశ్వరరావుకు హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలోని నిరుపేద దళిత రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి న్యాయరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. హుజూర్‌నగర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యనభ్యసించిన పల్లె నాగేశ్వరరావు మూడు దశాబ్దాలకు పైగా న్యాయవృత్తిలో కొనసాగుతూ పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్,...