PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 5:54 pm Posted by : Praja Sankshemam News

3.50 లక్షల LOC పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ప్రజాసంక్షేమం న్యూస్
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3.50 లక్షల LOC పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బట్టు నరహరి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా మంజూరైన రూ.3,50,000/-ల ఆర్థిక సహాయ మంజూరు పత్రాన్ని (కాపీ) నేడు వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద,మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని,ఆపద సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.