PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 6:16 pm Posted by : Praja Sankshemam News

KUDA చైర్‌పర్సన్‌గా జి.సుధారాణి నియామకం.

ప్రజాసంక్షేమం న్యూస్:
మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి జి.సుధారాణిని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.నియామకానికి సంబంధించిన ఇతర నిబంధనలు, షరతులను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేకంగా జారీ చేయనుంది.ఈ మేరకు జీఓ ఆర్‌టీ నెం.1291ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది.