PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 7:46 pm Posted by : Praja Sankshemam News

VB-G RAM G అమలుపై రాష్ట్రవ్యాప్త సమీక్ష

12 వేలకు పైగా సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్.. గ్రామసభల నిర్ణయాలకే ప్రాధాన్యత:మంత్రి సీతక్క
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:

VB-G RAM G అమలు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా సర్పంచులు పాల్గొన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, పనుల గుర్తింపు, ఉపాధి కల్పన, పనుల పురోగతిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.VB-G RAM G అమలులో గ్రామ పంచాయతీల పాత్ర, బాధ్యతలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల ఎంపికలో గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.అలాగే ఉపాధి పనుల అమలులో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనం పాటించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సమర్థవంతంగా కల్పిస్తూ, పథకం ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.