PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 12:00 pm Posted by : Praja Sankshemam News

అధికారి కారు.. పెండింగ్‌ చలాన్లు!

నిడమనూరు ఎంఆర్‌ఓ కారు పేరుతో రూ.5,310 జరిమానా పెండింగ్‌
నిడమనూరు:
ప్రభుత్వ అధికారుల వాహనాలపై పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిడమనూరు ఎంఆర్‌ఓ పేరుతో ఉన్న కారుపై 2024 నుంచి 2026 వరకు మొత్తం ఆరు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీటి మొత్తం జరిమానా రూ.5,310గా ఉన్నట్లు తెలుస్తోంది.
చలాన్లు ఎప్పుడు చెల్లిస్తారు?
ప్రభుత్వ విధుల్లో ఉండే అధికారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది ఒక అధికారి పేరుతో ఉన్న కారుపై చలాన్లు పెండింగ్‌లో ఉండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జరిమానాలను ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రైవేట్‌ వాహన వినియోగంపై వివరణ ఏది?
కారు వ్యక్తిగత పేరుతో ఉండటంతో, ప్రభుత్వ విధుల కోసం ఆ వాహనాన్ని వినియోగిస్తున్నారా? అలా వినియోగిస్తుంటే ప్రభుత్వ అలవెన్సులు పొందుతున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి, పెండింగ్‌ చలాన్ల వివరాలు, వాహన వినియోగం, ప్రభుత్వ నిబంధనల అమలుపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.