అధికారి కారు.. పెండింగ్ చలాన్లు!
నిడమనూరు ఎంఆర్‌ఓ కారు పేరుతో రూ.5,310 జరిమానా పెండింగ్ నిడమనూరు: ప్రభుత్వ అధికారుల వాహనాలపై పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిడమనూరు ఎంఆర్‌ఓ పేరుతో ఉన్న కారుపై 2024 నుంచి 2026 వరకు మొత్తం ఆరు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీటి మొత్తం జరిమానా రూ.5,310గా ఉన్నట్లు తెలుస్తోంది. చలాన్లు ఎప్పుడు చెల్లిస్తారు? ప్రభుత్వ విధుల్లో ఉండే అధికారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది ఒక అధికారి పేరుతో ఉన్న కారుపై చలాన్లు పెండింగ్‌లో ఉండటంపై ప్రశ్నలు...