అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందించడమే లక్ష్యం.యంఎల్ఎ

ప్రజాసంక్షేమం న్యూస్ హాలియా: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో లబ్ధిదారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు,...