అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు ఉరుమడ్ల, అక్టోబర్ 23: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును పొందేందుకు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, పట్టభద్రులు తమ ఓటును నమోదు...