PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 3:57 am Posted by : Praja Sankshemam News

అర్హులైన మాదిగ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి!

బి లింగ స్వామి మహారాజ్ మాదిగ జాగృతి సంఘం మండల నాయకుడు
అక్టోబర్ 29 గురువారం ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి

మునుగోడు మండల కేంద్రం లో మాదిగ జాగృతి సంఘ సమావేశంలో లింగస్వామి మహారాజ్ విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన మునుగోడు మండలంలో మాదిగ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నల్లగొండ జిల్లా మునుగోడు మండల మాదిగలకు ఉంటానికి ఇల్లు లేక చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతా ఉంది ఎకరాలు కొద్దిగా ఉన్న ఇతర కులాలకు ఇల్లు ఇచ్చి అర్హులైన మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే సమయంలో అధికారుల ఆ గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్లకు ఇల్లు కేటాయించాలని ఎలాంటి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా మాదిగ కుటుంబాలకు సామాజిక న్యాయం కల్పిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మాదిగ జాగృతి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం