ఆపదలో అండగా అమిత్ అన్న…

ఉరుమడ్ల, అక్టోబర్ 8 (ప్రజా సంక్షేమం న్యూస్): ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తూ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సేవా భావాన్ని చాటుకున్నారు.ఇటీవల ఉరుమడ్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాము, జనపాల లింగస్వామి మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించిన అమిత్ రెడ్డి.. ఇరు కుటుంబాలకు చెరో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక ఇబ్బందులు...