ఆర్టీఐ అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు

విచారణలు వాయిదా..సమాచారం కోసం ఎదురుచూపులు|కలెక్టర్ జోక్యం చేసుకోవాలి:ఖాజా మొయినొద్దీన్ జహీరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా సంక్షేమం న్యూస్): సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో సమాచారం అందడం లేదని, అప్పీళ్ల విచారణలు వాయిదా పడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి ఎండీ ఖాజా మొయినొద్దీన్ ఆరోపించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు.జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివరాలు అందకపోవడంతో ఆర్డీఓకు మొదటి అప్పీల్ చేసినట్లు ఆయన తెలిపారు....