ఈ నెల 28న నల్గొండకు మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 10.15 నుంచి సాయంత్రం 6.30 వరకు ఫిర్యాదుల స్వీకరణ నల్గొండ, అక్టోబర్ 24 (ప్రజా సంక్షేమం న్యూస్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ నెల 28న నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులను సందర్శించనున్నారు. పర్యటన సమయాలు: - ఉదయం 8.15 గంటలకు: హైదరాబాద్ నుంచి బయలుదేరడం. -...