ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందిన తెలంగాణ యువకుడి కుటుంబానికి రూ.6 లక్షల సాయం

సుదర్శన్ గౌడ్ కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్ క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి...