ఉమ్మడి నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్ష
పెండింగ్ పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువలు, అయిటిపాముల లిఫ్ట్‌పై ప్రత్యేక దృష్టి భూసేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కు విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ సచివాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ...