ఎల్‌నినో,కరువు పరిస్థితులపై ముందస్తు కార్యాచరణ: డిప్యూటీ సీఎం
అక్టోబర్ 31లోగా కరువు ప్రభావిత మండలాల గుర్తింపు పూర్తి చేయాలి త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం హైదరాబాద్,ప్రజా సంక్షేమం న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురయ్యే అవకాశమున్న కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కరువు పరిస్థితులపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ తొలి సమావేశంలో నిర్ణయించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ...