PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:05 am Posted by : Praja Sankshemam News

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై రాష్ట్ర అఖిలపక్ష సమావేశం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో కీలక భేటీ.
తాగునీరు,సాగునీరు,విద్యుత్ సరఫరా,ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై విస్తృత చర్చ.
ప్రజాసంక్షేమం న్యూస్ హైద్రాబాద్:

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం, కేబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర అఖిలపక్ష సమావేశం.బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తు, గది నంబర్ 33లో నిర్వహించిన సమావేశంలో ప్రజలు, రైతులపై వర్షపాతం లోటు ప్రభావాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ.తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగుకు విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, కరువు నివారణకు ముందస్తు చర్యలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.సమావేశంలో బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తదితరులు తమ అభిప్రాయాలను మంత్రుల బృందానికి వివరించారు.ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎల్‌నినో నోడల్ అధికారి రామకృష్ణారావుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.