ఎల్‌నినో ప్రభావంపై ఈ నెల 12న సీఎం ప్రత్యేక సమావేశం
235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు.. రైతులకు ఉపశమన చర్యలపై చర్చ హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తక్షణ ఉపశమన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, విద్యుత్ డిమాండ్ పెరుగుదలతో పాటు ఇతర అత్యవసర అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే 17...