ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

రబీ సాగులో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలి **వలిగొండ, అక్టోబర్ 13 (ప్రజా సంక్షేమం న్యూస్):** ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకొని రబీ సీజన్‌లో పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన *రైతు నేస్తం* కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, రబీ పంటలపై...