PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 8:59 pm Posted by : Praja Sankshemam News

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి

ప్రజా సంక్షేమం న్యూస్ – హైదరాబాద్:ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వీబీ-జీ రామ్ జీ పథకం అమలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.370 రకాల పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించి, కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా ఎనిమిది నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 30లోగా మండలస్థాయి ప్రణాళికలు పూర్తి చేసి, నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని, సర్పంచులను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 7 శాతం వర్క్‌షేర్‌ ప్రకారం పనులను గుర్తించాలని, ఆదివాసీ గిరిజనులకు జాబ్‌ కార్డుల జారీలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు.