PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 3:32 pm Posted by : Praja Sankshemam News

ఎస్సీల అభివృద్ధి పథకాల అమలులో జాప్యం వద్దు!

SCSDF నిధులను లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:

జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (SCSDF) జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సీల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల పురోగతి, నిధుల వినియోగంపై వేముల వీరేశం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పథకాలను సకాలంలో, పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు. కేటాయించిన నిధులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వినియోగిస్తూ, అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ విప్ వేముల వీరేశంను సంబంధిత శాఖల అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు.