ఎస్సీల అభివృద్ధి పథకాల అమలులో జాప్యం వద్దు!
SCSDF నిధులను లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SCSDF) జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సీల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల పురోగతి, నిధుల వినియోగంపై వేముల వీరేశం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు...