ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి:డిప్యూటీ సీఎం
వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్: డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఎస్సీ, ఎస్టీ ప్రోగ్రెస్ సబ్‌ప్లాన్ అమలు,శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, వ్యయ పురోగతి,రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఎస్సీ,ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారతే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను ఎలాంటి జాప్యం లేకుండా...