ఓటు హక్కును హరించే ప్రయత్నాలను అడ్డుకుంటాం: మల్లు భట్టి విక్రమార్క

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ఆందోళన.. ప్రజాస్వామ్య పరిరక్షణకు సత్యాగ్రహం న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలు:ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో ఓటర్ల హక్కులకు విఘాతం కలిగించే చర్యలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థను బీజేపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు...