కళాకారుల రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలి
అర్హులైన కళాకారులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి మునుగోడు, అక్టోబర్ 14, ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట అక్టోబర్ 15న గురువారం నిర్వహించనున్న కళాకారుల రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న పిలుపునిచ్చారు.మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న గద్దర్ అధ్యక్షతన నిర్వహించిన నిరుద్యోగ ఉద్యమ కళాకారుల అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులు గ్రామగ్రామాన ధూంధాం...