కళాకారుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి : జూపల్లి కృష్ణారావు
సాంస్కృతిక సారథిలో మరింత మందికి ఉద్యోగావకాశాలపై ప్రభుత్వ పరిశీలన కళాకారుల వేతనాలు రూ.31,868కి పెంపు.. ప్రతి నెల 1న జీతాల చెల్లింపు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు కళాకారులు పోషించిన పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కళాకారులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు.కళాకారులంటే తనకు ఎంతో గౌరవం ఉందని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో...