కాంట్రాక్టు విధానం రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలి
అక్టోబర్ 26న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలి ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ, అక్టోబర్ 24: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వల్లపుదాసు భూలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. ఈ నెల 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో...