ప్రజాసంక్షేమం న్యూస్:
మేడ్చల్-మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.శనివారం ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు,బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు:
సరూర్ నగర్,ఎల్బీనగర్,పేరూరులలో ఇళ్లు మరియు ప్లాట్లు
మిర్యాలగూడ హాలియాలో 2 ఎకరాల వ్యవసాయ భూమి
రూ.7లక్షల నగదు, 60 తులాల బంగారం, విటారా బ్రెజ్జా కారుమొత్తం ఆస్తుల ప్రభుత్వ విలువే సుమారు రూ. 2,28,50,000/- కాగా, బహిరంగ మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది.
గత నెలలో లంచం తీసుకుంటూ పట్టుబడి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆంజనేయులుపై ఏసీబీ అధికారులు పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టనున్నారు.
లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్: 106