PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 4:07 pm Posted by : Praja Sankshemam News

కేసుల్లో శిక్షల శాతం పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలి

కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు
నల్లగొండ, అక్టోబర్ 31 (ప్రజా సంక్షేమం న్యూస్):

కేసుల్లో నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం పెంచుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కోర్టుల్లో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర కీలక పత్రాలను పకడ్బందీగా సమర్పించాలని ఆదేశించారు.కోర్టు సమన్లు, వారెంట్లను సకాలంలో అమలు చేయడంతో పాటు విచారణ సమయంలో సాక్షులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.కేసుల్లో నేర నిరూపణకు కృషి చేసి శిక్షలు పడేలా చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు. ఇదే అంకితభావంతో పనిచేస్తూ నాణ్యమైన దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ద్వారా నేర నిరూపణ శాతాన్ని పెంచాలని పోలీసు అధికారులకు సూచించారు.