కేసుల్లో శిక్షల శాతం పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలి

కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు నల్లగొండ, అక్టోబర్ 31 (ప్రజా సంక్షేమం న్యూస్): కేసుల్లో నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం పెంచుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కోర్టుల్లో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర కీలక పత్రాలను పకడ్బందీగా సమర్పించాలని ఆదేశించారు.కోర్టు...