ప్రజాసంక్షేమం న్యూస్ కేరమెరి
గిరిజన హక్కుల సాధనకు కొమురం భీం చేసిన పోరాటం చిరస్మరణీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కొమురం భీం 86వ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘జల్–జంగల్–జమీన్’ నినాదంతో భీం సాగించిన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.