జాతిపిత మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 2:
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
సత్యం, అహింసే గాంధీజీ బోధనలు:సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను గాంధీజీ తన జీవితంలో ఆచరించి, వాటి శక్తిని ప్రపంచానికి చాటారని సీఎం పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
మానవాళికి శాశ్వత స్ఫూర్తి:మహాత్మా గాంధీ జీవితం, ఆయన సిద్ధాంతాలు యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం, మానవతా విలువలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.