గాంధీజీ ఆశయాలు యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకం

జాతిపిత మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సత్యం, అహింసే గాంధీజీ బోధనలు:సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను గాంధీజీ తన జీవితంలో ఆచరించి, వాటి...