గ్యాస్ సిలిండర్‌పై అదనపు వసూళ్ల ఫిర్యాదును పరిష్కరించకుండానే ముగించారా?
వినియోగదారుడితో మాట్లాడకుండానే మాట్లాడినట్లు హెచ్‌పీసీఎల్ అధికారులకు నివేదిక! గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని బాధితుడి డిమాండ్ సదాశివపేట/సంగారెడ్డి,అక్టోబర్31(ప్రజాసంక్షేమం న్యూస్):గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో నిర్ణీత ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఓ వినియోగదారుడు చేసిన ఫిర్యాదుపై సరైన విచారణ జరగకుండానే పరిష్కరించినట్లు అధికారులు ఫిర్యాదును ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన హెచ్‌పీ గ్యాస్ వినియోగదారుడు ఖాజా మొయినుద్దీన్ సిలిండర్ రీఫిల్ డెలివరీ సమయంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ గ్రీవెన్స్ నంబర్...