జగదీష్‌రెడ్డి ప్రెస్‌మీట్ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం: వేముల వీరేశం
విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ప్రశ్నలు ప్రజాసంక్షేమం న్యూస్ | హైదరాబాద్. జగదీష్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్ ఆయనకే ప్రతికూలంగా మారిందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్, సాగునీటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు.విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిపై ఎన్ని సమీక్షలు నిర్వహించారని జగదీష్‌రెడ్డిని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం విదేశీ బొగ్గు దిగుమతుల ఒప్పందం,...