జాంబియాలో బోర్ డ్రిల్లింగ్ ప్రమాదం.. ఉరుమడ్ల వాసి మృతి

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన జన్నపాల లింగస్వామి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి చిట్యాల: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన బోరింగ్ రిగ్ వర్కర్ జన్నపాల లింగస్వామి (50) జాంబియా దేశంలో జరిగిన బోర్ డ్రిల్లింగ్ ప్రమాదంలో మృతి చెందారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన లింగస్వామి బోర్ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.లింగస్వామికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో...