PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:38 pm Posted by : Praja Sankshemam News

జాతీయ జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలి.

శంషాబాద్‌లో టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

ప్రజాసంక్షేమం న్యూస్ శంషాబాద్: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని గొల్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సభలో ఓబీసీ కులాల సమగ్ర గణన అవసరం, బీసీల జనాభా ప్రాతిపదికన హక్కులు, సంక్షేమ పథకాల రూపకల్పన తదితర అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పలువురు ప్రజా ప్రతినిధులు, బీసీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.