PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 3:13 pm Posted by : Praja Sankshemam News

టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం

**హైదరాబాద్‌లో సమావేశం.. పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు**
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ కార్యకలాపాలు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు చర్చించారు.ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐపీసీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు.అలాగే ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.