ట్రీటెడ్ వాటర్ వినియోగం తప్పనిసరి చేయాలి!
ఎస్టీపీల నిర్వహణలో ఏఐ సాంకేతికతను వినియోగించాలి: సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్,అక్టోబర్ 28 రాష్ట్రంలో శుద్ధి చేసిన మురుగునీటి (ట్రీటెడ్ వాటర్) వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ఎస్టీపీలు, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నీటి నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ట్రీటెడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఏఐ సాంకేతికతను వినియోగించాలని, ప్రతి...