తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : పున్న కైలాష్ నేత

జానారెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత బహిరంగ లేఖ ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన జానారెడ్డి అజాతశత్రువని, హింసకు తావులేని రాజకీయాలను నడిపి నల్లగొండ జిల్లాను ఆదర్శ రాజకీయ క్షేత్రంగా తీర్చిదిద్దారని...