తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం సానుకూలత.. తెలంగాణకు శుభపరిణామం: వేముల వీరేశం
కాళేశ్వరం డిజైన్‌పై తీవ్ర విమర్శలు.. బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగడం తెలంగాణకు శుభపరిణామమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించడం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన...