తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి: CM
152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి కసరత్తు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి **హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా సంక్షేమం న్యూస్):**తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న చర్చలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో, అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం తదితర వివరాలను సిద్ధం చేయాలని సూచించారు....