తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హ్యుందాయ్కు సీఎం ఆహ్వానం
**రూ.8,528 కోట్ల పెట్టుబడి.. 4,276 ఉద్యోగాల కల్పనే లక్ష్యం** **జహీరాబాద్ నిమ్జ్లో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం.. ప్రభుత్వ సహకారం అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ** ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తెలిపారు. కార్ల తయారీ పరిశ్రమ స్థాపనకు తెలంగాణ అనువైన ప్రాంతమని పేర్కొంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని హ్యుందాయ్ ఇండియా సంస్థను ఆహ్వానించారు.తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని...