తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
**రామన్నపేట:** తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణక్క, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ నేతృత్వంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదె శోభారాణి, వైస్ ప్రెసిడెంట్ అయ్యడపు కవిత, టౌన్ కన్వీనర్ బోయిన శోభ పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా సంబరాలు ఉత్సాహంగా సాగాయి.