తెలంగాణ సంస్కృతి వైభవం.. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి **హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:** ప్రకృతిని ఆరాధిస్తూ.. పూలను పూజిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే అపురూపమైన పూల పండుగ బతుకమ్మ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు తమ సందేశంలో పేర్కొన్నారు.తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలు, ఆడబిడ్డల ఆటపాటలు, జానపద గీతాలతో వెల్లివిరిసే ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.పూలన్నీ కలిసి బతుకమ్మగా వికసించినట్లే ప్రతి కుటుంబంలో...