తోటి ఉద్యోగి కుటుంబానికి రూ.6.01 లక్షల ఆర్థిక సాయం
దివంగత పంచాయతీ కార్యదర్శి అంజయ్య కుటుంబానికి అండగా ఉద్యోగులు.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తా: కలెక్టర్ బి. చంద్రశేఖర్ నల్లగొండ, అక్టోబర్ 30 (ప్రజా సంక్షేమం న్యూస్): తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచి పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు మానవత్వాన్ని చాటుకున్నారు. దివంగత పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్యోగులు, యూనియన్ నాయకులు, శ్రేయోభిలాషులు సమష్టిగా సేకరించిన రూ.6,01,751 ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చేతుల మీదుగా అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ...