దేవరకొండ నియోజకవర్గం లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి!

ఆర్‌అండ్‌బీ,పంచాయతీరాజ్,విద్యుత్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష ప్రజాసంక్షేమం న్యూస్ దేవరకొండ:దేవరకొండ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా గతంలో చేపట్టిన, ప్రస్తుతం కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేయాలని, దెబ్బతిన్న రహదారులను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు.పంచాయతీరాజ్...