PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 2:53 pm Posted by : Praja Sankshemam News

నకిరేకల్‌లో ప్రభుత్వ కార్యాలయ సముదాయం నిర్మాణ పనులు వేగవంతం

ర రూ.20 కోట్లతో అన్ని శాఖలు ఒకే చోట.. నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష
ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్
: నకిరేకల్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయ సముదాయ భవన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ఈ సముదాయ నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.ముందుగా తన కార్యాలయంలో భవన సముదాయ నిర్మాణ ప్లాన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణ స్థలాన్ని సందర్శించి, పనుల పురోగతిపై సమీక్షిస్తూ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఒకే చోట అన్ని ప్రభుత్వ సేవలు:
ఈ సముదాయంలో MRO, MPDO కార్యాలయాలతో పాటు ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖలు సహా పలు ప్రభుత్వ శాఖలు ఒకే చోట కొలువుదీరనున్నాయి. దీంతో వివిధ ప్రభుత్వ సేవల కోసం ప్రజలు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, ఒకే చోట సేవలు పొందే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.