PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 10:17 pm Posted by : Praja Sankshemam News

నకిరేకల్ అభివృద్ధికి సహకరించాలి

వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని నరేందర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల అంశాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.