ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను నకిరేకల్ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.ఈ భేటీలో మండల పార్టీ అధ్యక్షుడు పున్న జగన్ మోహన్, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, బాచుపల్లి గంగాధర్, PACS చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, జినుకల ప్రభాకర్, గుత్త నర్సింహారెడ్డి, రామిని రమేష్, పిట్టా వెంకట్ రెడ్డి, శంభాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు పూస బాలకిషన్ కూడా భేటీలో పాల్గొన్నారు.